బాలుడి వైద్య కోసం 10000 అందించిన ఇన్స్పెక్టర్ నాగమల్లు

ఎల్బీనగర్: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, చిన్ననేమిల గ్రామానికి చెందిన శాగంటి రవి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి నిర్మాణం లో ఉన్న ఇంటికి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు, అతడి కుమారుడు ఉదయ్ 9 సంవత్సరాలు 25.6.2021 రోజున రెండవ అంతస్తునుండి కిందపడటంతో తలకు తీవ్రమైన గాయం అయ్యింది. ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేయడం తో వెంటిలేటర్ పై ఉన్నాడు, పేదరికంతో ఉన్న తల్లి తండ్రులు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతూ తమ బిడ్డను బ్రతికించాలని దాతలను వాట్సాప్ ద్వారా వేడుకగా అది చూసిన ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు వెంటనే హాస్పిటల్ వెళ్లి గాయపడిన బాబు తల్లి, తండ్రి కి ధైర్యం చెప్పి పదివేల రూపాయలు వైద్య ఖర్చులకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా అంజపల్లి నాగమల్లు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. మనం చేసే చిన్న సహాయం ఆపదలో ఉన్నవారికి గొప్ప తోడ్పాటు ఇస్తుందని తెలిపారు.
ఆపదలో ఉన్నవారికి ఇప్పటికి 33 సార్లు రక్తదానం చేసి, ఇద్దరు వృద్దులకు ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఉన్నత అధికారుల మాటలే తను సహాయం చేయడానికి స్ఫూర్తి ని ఇచ్చాయని తెలిపాడు.

మానవత్వం తో స్పందించే వారు ఉంటే బాలుడికి సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు.

1 Comment

  • It’s difficult to find well-informed people in this particular topic,
    however, you sound like you know what you’re talking about!
    Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *